త్వరలో తగ్గనున్న డీజిల్ ధర

డీజిల్ ధరలు త్వరలోనే తగ్గనున్నాయి. డీజిల్ ధరను కాస్త తగ్గించేందుకు ఆయిల్ కంపెనీలు ముందుకొచ్చాయి. లీటర్ డీజిల్ పై రూ.3.56 తగ్గించేందుకు ఓకే చెప్పాయి. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ రిజల్ట్ తర్వాత ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఇంటర్నేషనల్ గా క్రూడ్ ఆయిల్ ధర తగ్గడంతో..డీజిల్ రేటు తగ్గించే పనిలో పడ్డాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పటికే పెట్రోల్ పై ఒక్క రూపాయి తగ్గించాయి ఈ కంపెనీలు. మహారాష్ట్ర, హర్యానాలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో డీజిల్ ధరనును తగ్గించలేదు. ఈ నెల 19న రిజల్ట్ వచ్చాక డీజిల్ కాస్ట్ పై అధికారిక ప్రకటన చేయనున్నారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy