త్వరలో వాట్సాప్ లో వీడియో కాల్

whats appప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజ్ సర్వీసింగ్ యాప్ వాట్సాప్. గత సెప్టెంబర్ నాటికి ఈ యాప్ ని ఉపయోగిస్తున్న వారి సంఖ్య 90 కోట్లకు చేరింది. ఇప్పుడు వారి సంఖ్య మరింత పెరిగి ఉండవచ్చు. అయితే ప్రజలు ఇంతలా ఉపయోగిస్తున్న ఈ యాప్ లో స్కైప్, హ్యాంగ్ అవుట్స్ లో లాగా వీడియో కాలింగ్ సదుపాయం లేదు. ఈ లోటును భర్తీ చేస్తూ త్వరలోనే వాట్సాప్ లో వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉందట. త్వరలో విడుదల చేయనున్న IOS వెర్షన్ లో ఈ వీడియో కాలింగ్ సదుపాయాన్ని కల్పించాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక జర్మన్‌ వెబ్‌సైట్‌ లో ఈ న్యూస్ వచ్చింది.  IOS వెర్షన్‌ వీడియో కాలింగ్‌ని టెస్ట్‌ చేస్తుండగా తీసిన కొన్ని స్క్రీన్‌షాట్స్‌ని ఆ వెబ్‌సైట్‌ విడుదల చేసింది. ఈ స్క్రీన్‌షాట్స్‌ ఆధారంగా.. వీడియో కాల్‌ మాట్లాడుతూనే ఫొటోలు కూడా తీసే అవకాశముంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy