త్వరలో 1,603 నర్సు పోస్టుల భర్తీ

tspscప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొన్న నర్సుల కొరతను తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా మరో 1,603 నర్సింగ్ పోస్టులను భర్తీచేయనున్నట్లు డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు. TSPSC ద్వారా త్వరలోనే ఈ పోస్టులను భర్తీచేస్తామని గురువారం(నవంబర్-23) నిలోఫర్  ఆస్పత్రిలో జరిగినగిన సమీక్షాసమావేశంలో ప్రకటించారు. కొత్త పోస్టుల భర్తీతో ప్రస్తుతం ఉన్న నర్సులపై ఉన్న భారం తగ్గుతుందని తెలిపారు. గాంధీ, పేట్లబుర్జు, నిలోఫర్ దవాఖానల్లో కూడా సంతాన సాఫల్య కేంద్రాలను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఉస్మానియా, గాంధీ, పేట్లబుర్జు దవాఖానల్లోని అత్యాధునిక ల్యాబ్‌లతో మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు. త్వరలో అన్ని బోధనా దవాఖానల్లో 24 గంటలపాటు ల్యాబ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

అత్యవసర పరిస్థితుల్లో దవాఖానకు వచ్చే ఔట్ పేషెంట్లకు 24 గంటలపాటు మెడిసిన్స్ ను అందిస్తామని…ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నిలోఫర్ దవాఖానలో ఈ నెల 27వ(సోమవారం) తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. దవాఖానల్లోని ల్యాబ్ టెక్నీషియన్స్‌ను మిగతా విభాగాలకు రొటేషన్ చేయనున్నట్టు వివరించారు. దవాఖానల్లో పారిశుద్ధ్యం, సెక్యూరిటీ విభాగాలను మరింత పటిష్టం చేస్తామని, రోగులు, సహాయకులతో దురుసుగా ప్రవర్తించకుండా ఉండేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy