త్వరలో 40 డయాలసిస్ సెంటర్లు : లక్ష్మారెడ్డి

laxmareddy-wanaparthyతెలంగాణ రాష్ట్రంలో మొత్తం 40 డయాలసిస్ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో సింగిల్ యూస్డ్ డయాలసిస్ సెంటర్స్ ని ప్రారంభిస్తున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం (నవంబర్-10) వనపర్తి ఏరియా హాస్పిటల్ లో 5 పడకల డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించారు మంత్రి లక్ష్మారెడ్డి. కిడ్నీ వ్యాధి బాధితులకు వ్యయ, ప్రయాసలు తగ్గుతాయన్నారు. ఇప్పటికే 5 సెంటర్స్ ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రారంభించిన వనపర్తి, గద్వాల సెంటర్స్ తో కలిపి 7 డయాలసిస్ సెంటర్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. హాస్పిటల్ ఆవరణలో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy