థాంక్ గాడ్.. మా బాబు దొరికాడు  

pasiకరీంనగర్ శివారులోని చల్మెడ ఆనందరావు హాస్పిటల్ లో అదృశ్యమైన పసిబిడ్డ తల్లి చెంతకు చేరాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కరీంనగర్‌ శివారులో లభ్యమైనట్లు చెబుతున్నారు పోలీసులు. కరీంనగర్‌ మండలం చామన్‌పల్లికి చెందిన వడ్లకొండ రమ్య, ప్రవీణ్‌ దంపతులకు.. చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో ఈనెల 14న మగ బిడ్డ పుట్టాడు. అయితే మంగళవారం తెల్లవారుజామున బాబును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది.. పరిసరాలన్నీ వెదికారు. బాబు కనిపించకపోవడంతో బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. వేకువజామున 4 గంటలకు గుర్తుతెలియని మహిళ ప్రసూతివార్డులోకి వెళ్లి బాబును బ్యాగులో పెట్టుకొని మరో యువకుడితో కలసి హోండా యాక్టివా వాహనంలో బయటకు వెళ్లినట్లు గుర్తించారు.

ఐదు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి.. ఎట్టకేలకు పసిబిడ్డను తల్లి చెంతకు చేర్చారు. అనుమానిత మహిళ, యువకుడి ఫొటోలను రిలీజ్ చేశారు. వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు అందిస్తామంటున్నారు పోలీస్ అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy