దక్షిణాదివాళ్లు నల్లజాతీయులా : బీజేపీ నేత నోటిదురుసు వ్యాఖ్యలు

tarun vijayఒక్క నోరు.. నరంలేని నాలుక యుద్ధాలను తీసుకొస్తోంది.. శాంతిని స్థాపిస్తుంది. జాగ్రత్తగా మాట్లాడకపోతే రాజ్యాలనే కూల్చేస్తోంది. ఇన్నేసి విశేషాలను ఇప్పుడు ఎందుకు అంటారా.. బీజేపీ జాతీయ నేత, ఉత్తరాఘండ్ రాజ్యసభ మాజీ సభ్యుడు తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ఉత్తర – దక్షిణ భారతదేశం మధ్య అంతరాన్ని చెబుతోంది. నార్త్ ఇండియన్స్ కు దక్షిణాది వాళ్లపై ఎలాంటి చులకన భావం ఉంటుందో ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఆన్ లైన్ న్యూస్ ఛానల్ అల్ జజీరా నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు. నోయిడాలో ఆఫ్రికల్ విద్యార్థులపై జగిన దాడిని మీరెలా చూస్తారని విలేకరి ప్రశ్నించాడు. దీనికి తరుణ్ విజయ్ చెప్పిన సమాధానం ఇలా ఉంది. మేము జాతిగల వాళ్లమే అయితే ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక, కేరళ ప్రజలతో ఎలా కలిసి ఉంటామని.. జాత్యాహంకారులం అయితే వాళ్లతో ఎలాకలిసి బతుకుతాం అని వ్యాఖ్యానించారు. మనచుట్టూనే నల్లజాతీయులే ఉన్నారు కదా అని వ్యాఖ్యానించారు. సౌత్ ఇండియా ప్రజలను నల్లజాతీయులతో పోల్చాడు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావటంతో.. దిగి వచ్చాడు మాజీ ఎంపీ తరుణ్. కృష్ణుడు కూడా నల్లగానే ఉంటాడు.. ఆయన్ను పూజిస్తూనే ఉన్నాం కదా.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కవర్ చేసుకున్నాడు. ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే క్షమించాలంటూ ట్వీట్స్ చేశాడు. దక్షిణాది రాష్ట్రాలను కించపరిచే ఉద్దేశం లేదని.. చర్చ సందర్భంగా అన్న వ్యాఖ్యలను వక్రీకరించారని అందరిలాగే తప్పించుకున్నాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy