దత్తన్న ‘అలయ్ బలయ్’

ALAIBALAI-7ఆత్మీయ ఆలింగనాలు, మనసారా పలకరింపులు, ఆటలు, పాటలు, పసందైన రుచులు… అన్నింటికి కేరాఫ్ అడ్రస్ అలయ్ బలయ్.  అందరిని ఏకం చేసే ఈ ప్రోగ్రామ్ కు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కేంద్రమంత్రి దత్తాత్రేయ. ఇవాళ జలవిహార్ లో జరగనున్న  అలయ్ బలయ్ కి గవర్నర్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు… అన్ని పార్టీల లీడర్లను ఇన్వైట్ చేశారు దత్తన్న.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు  ప్రతీకగా నిలిచే అలయ్ బలయ్ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా.. అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. ఇవాళ జరగనున్న వేడుకకు  జలవిహార్ ముస్తాబయ్యింది.

ALAIBALAI-6గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు.. స్పీకర్, మండలి చైర్మన్, కేంద్రమంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను అలయ్ బలయ్ లో పాల్గొనాలని ఇన్వైట్ చేశారు దత్తన్న. ప్రోగ్రామ్ లో  ప్రజాకవులు గద్దర్, గోరెటి వెంకన్న, అందెశ్రీ, మరికొందరు కవులు, కళాకారులు  ఆటాపాటలతో సందడి చేయనున్నారు.

అలయ్ బలయ్ లో తెలంగాణ కళారూపాల ప్రదర్శన హైలైట్ గా నిలవనుంది. జానపదాలు, ఒగ్గుకథలు. గోండు నృత్యాలతో పాటు  బోనాలు, బతుకమ్మల ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఇక.. అతిథుల కోసం తెలంగాణ రుచులన్నింటిని రెడీ చేస్తున్నారు. దత్తాత్రేయ కేంద్రమంత్రి అయ్యాక  ఫస్ట్ టైం  అలయ్ బలయ్ జరుగుతుండటంతో  ఏర్పాట్లు గ్రాండ్ గా చేశారు.

ALAIBALAI-4 ALAIBALAI-3 ALAIBALAI-2

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy