దబ్బనంలో దూరే చీర : శ్రీవారికి సమర్పించిన సిరిసిల్ల నేతన్న

అగ్గిపెట్టెలో ఇమిడే చీరతో చేనేత కళావైభవాన్ని ప్రపంచానికి చాటిన నల్ల పరంధాములు కొడుకు నల్ల విజయ్ కుమార్.. దబ్బనంలో దూరే చీరను మంగళవారం(జులై 10) తిరుమల శ్రీవారికి సమర్పించాడు. 5 మీటర్ల పొడువు, 45 అంగుళాల వెడల్పుతో 100 గ్రాముల బరువున్న ఈ చీరను  తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో ప్రదర్శించారు. ఈ చీరను స్వామివారికి బహూకరించడం సంతోషంగా ఉందని, గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీర, శాలువను స్వామివారికి కానుకగా సమర్పించానని చెప్పారు నల్ల విజయ్ కుమార్. చీర తయారీకి రూ. 15 వేలు ఖర్చయిందని, దీనిని మగ్గంపై 15 రోజులలో నేశానని తెలిపారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy