దమ్ముంటే నాతో 15 నిముషాలు చర్చించు: మోడీకి రాహుల్ సవాల్

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలతో దాడికి దిగుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ఆరోపణలకు దిగుతున్నారు.ఇందులో బాగంగా ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ లో ఇవాళ (ఆదివారం) జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ … ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. దమ్ముంటే తనతో 15 నిమిషాల పాటు చర్చలో కూర్చోవాలని సవాలు విసిరారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అగ్రిమెంట్ పై ప్రధానికి తనతో బహిరంగ చర్చలో కూర్చునే ధైర్యం లేదన్నారు రాహుల్. మోడీ అర్థరాత్రి సీబీఐ చీఫ్ ను తొలగించి ఆ సంస్థ ప్రతిష్టను మరింత  దిగజార్చారన్నారు. కేవలం సీబీఐనే కాకుండా రిజర్వు బ్యాంకు, ప్రభుత్వ సంస్థలు, సుప్రీం కోర్టు సహా అన్ని ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రశ్నలకు ప్రధాని మోడీ దగ్గర సమాధానాలు లేవనీ…. అందుకే ఆయన చర్చకు రావడంలేదన్నారు రాహుల్ గాంధీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy