
ఇది రూ.17 నుంచి 25 రూపాయల వరకు ఉంది. దీనికి GST అదనం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.17 నుంచి 25 రూపాయలు వసూలు చేస్తోంది. HDFC, ICICI బ్యాంక్ రూ.25 వసూలు చేస్తున్నాయి. ఖాతాలో ఉన్న డబ్బులకు మించి పొరపాటున కూడా ఏటీఎం మెషిన్ లో కార్డు పెట్టకూడదు. అదే విధంగా స్వైపింగ్ మిషన్ దగ్గర కార్డు ఇవ్వొద్దు.
ఇప్పటి వరకు ఇలాంటి లావాదేవీల్లో ఛార్జీలు లేవు. కొంత మంది.. బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో కూడా తెలుసుకోకుండా.. ఒకటికి రెండు, మూడు సార్లు ATM మిషన్ల దగ్గర ట్రై చేస్తూ ఉన్నారని చెబుతున్నాయి బ్యాంకులు. మొదట వెయ్యి రూపాయలు కొడతారు.. రాకపోతే 500 కొడతారు.. అదీ రాకపోతే 200 రూపాయలు అంటూ ఇష్టానుసారం డెబిట్ కార్డులను వాడేస్తున్నారని చెబుతోంది. దీంతో బ్యాలెన్స్ లేకుండా డబ్బులు డ్రా చేయటానికి డెబిట్ కార్డు ఉపయోగిస్తే.. ఛార్జీ పడే విధానాన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్నాయి. ఈ నిర్ణయాన్ని బ్యాంకులు సమర్ధించుకుంటున్నాయి. చెక్ బౌన్స్ ఛార్జీల కంటే ఇది చాలా చాలా తక్కువ అని గట్టిగా చెబుతున్నాయి. న్యాయమైన నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని కూడా సూచిస్తోంది..
సో.. బ్యాంకు ఖాతాదారులు బీ కేర్ ఫుల్. డబ్బు ఉంటేనే ATMకి వెళ్లాలి.. బ్యాలెన్స్ చెక్ చేసుకుని మాత్రమే కార్డు ఏటీఎం మెషీన్ లో పెట్టండి లేదా దబిడిదిబిడే. ఉన్న బ్యాలెన్స్ లో కూడా 25 రూపాయలు మాయం అవుతాయి..