దలైలామా పర్యటనను నిలిపేయండి: చైనా

DALAILAMAబౌద్ధ మత గురువు దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. దీనిపై  చైనా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వివాదాస్పద  ఆ ప్రాంతం లో దలైలామా పర్యటనను వెంటనే నిలిపివేయాంటూ భారత్‌కు అల్టిమేటం జారీచేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో దలైలామా పర్యటనకు అనుమతించడం ద్వారా భారత్‌ తమతో సంబంధాలను చెడగొట్టుకునే సాహసం చేసిందని మండిపడింది.

టిబేట్‌ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా మంగళవారం  నుంచి వారం రోజులపాటు అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. దలైలామా పర్యటన భారత్‌ అంతర్గత విషయమని.. ఈ విషయంలో రాద్ధాంతం చేయడం తగదని భారత్‌ ఇప్పటికే చైనాకు స్పష్టం చేసింది. అయితే, అరుణాచల్‌ ప్రదేశ్‌ దక్షిణ టిబేట్‌లో భాగమని మొండిగా వాదిస్తున్న చైనా.. సరిహద్దుల్లో ఆ వివాదాస్పద ప్రాంతానికి దలైలామాను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది.

తప్పుడు చర్యలను వెంటనే మానుకోవాలని భారత పక్షాన్ని కోరుతున్నామని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హు చున్యింగ్ తెలిపారు. సున్నితమైన విషయాలను రెచ్చగొట్టదన్నారు. భారత్‌-చైనా సంబంధాల వృద్ధికి దోహదపడే సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. దలైలామా ఆధ్యాత్మిక కారణాలతోనే ఈ పర్యటన చేస్తున్నారన్న భారత వాదనను కూడా చైనా తోసిపుచ్చింది. వివాదాస్పద ప్రాంతంలో దలైలామా ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించింది. తమ అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ దలైలామా పర్యటనను అనుమతించినందుకు భారత్‌కు తమ నిరసనను తెలుపుతామని చైనా పేర్కొంది. ఇది రెండు దేశాల సంబంధాలను దారుణంగా దెబ్బతీయడమే కాకుండా సరిహద్దు వివాదంలో ఉద్రిక్తతలు పెంచవచ్చునంటూ సంకేతాలు ఇచ్చింది చైనా.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy