దళితులపై కోపంతో.. మంచినీటి బావిలో కిరోసిన్

dhalitస్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతున్నా .. దళితులు, ఆదీవాసీలను అంటరాని వాళ్లుగా చూడటం ఇంకా మానలేదు. ఓ దళితుడు.. ఘనంగా తన కూతురి వివాహాన్ని జరిపించడం ఇష్టంలేని అగ్రవర్ణాలకు చెందిన కొందరు.. దళితవాడలోని ఓ మంచినీటి బావిలో కిరోసిన్ పోశారు.  తాగునీటి బావిలో కిరోసిన్‌ కలపడం అక్కడ కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్ లోని మాడా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

మేఘ్ వాల్ అనే దళితుని కుమార్తె వివాహం ఏప్రిల్ 23న జరిగింది. అనంతరం ఊరేగింపుకు బయలుదేరగా.. పెళ్లి ఊరేగింపులకు దళితులు అర్హులు కాదని.. అడ్డుపడ్డారు అగ్రవర్ణాల వాళ్లు. ఈ విషయం తెలుసుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. పోలీసులతో ఆ పెళ్లికి సెక్యూరిటీ ఇచ్చారు. పోలీసుల సమక్షంలో పెళ్లి సంబరాలు ఘనంగా జరిగాయి.

పట్టరాని కోపంతో.. దళితులు వాడే తాగునీటి బావిలో కిరోసిన్ పోశారు. బావిలోని నీరు తాగేందుకు పనికిరాకుండా పోయింది. ఆ గ్రామంలోని దళితులకు ఈ బావి ఒక్కటే ఆధారం కావడంతో.. తాగునీటి కోసం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నదికి వెళ్లి మంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామంలో రెండు బోర్ పంపులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy