దళిత రాజకీయ చైతన్య దీప్తి కాకా

venkataపేద, దళిత విద్యార్ధుల కోసం ఎన్నో ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ స్థాపించారు కాకా. స్టూడెంట్స్ కు అండగా నిలిచారు. మహిళలకు.. పంచాయితీ రాజ్ లో రిజర్వేషన్లు కల్పించారు. ఫ్యాషన్ అంటే ఏంటో అంతగా తెలియని టైంలో…ఫ్యాషన్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ గా నిఫ్ట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. అందుకే ఆయన పేరు రాజకీయాల్లో ఒక సంచలనం. తెలంగాణాకు ఆయనే ఒక చరిత్ర…అయ్యారు.

దళితుల రాజకీయ చైతన్యానికి, సాధికారతకు ప్రతీకగా నిలిచిన నాయకుడు… వెంకటస్వామి. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఆయన ఎప్పుడూ ప్రత్యేకమైన దృష్టిని పెట్టేవారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా కొన్నాళ్లు పనిచేశారు. 2002లో ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా కూడా ఎంపికై బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారి 1957లో ఎమ్మెల్యే అయిన కాకా…అప్పటి నుంచీ 2007 వరకూ ఏ పదవిలో ఉన్నా…దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే.. వచ్చారు. ఒక్కోసారి రెండు, మూడు పదవులు కూడా మేనేజ్ చేసిన ఘనత కాకాది.

1991లో పీవీ హయాంలో మొదట్లో… కాకా గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్నారు. పంచాయితీ రాజ్ లో ఎస్సీ, ఎస్టీ కోటా పెట్టించిన రాజీవ్ గాంధీ మహిళా కోటా ఇవ్వాలనుకున్నా సాధ్యం కాలేదు. కానీ రాజీవ్ ఆలోచనను సవరణ బిల్లు రూపంలో తెచ్చారు…గడ్డం వెంకటస్వామి. ఇపుడు పంచాయితీల్లో అమలవుతున్న 50 శాతం మహిళా కోటా ఆయన తెచ్చిందే. అదేసమయంలో పంచాయితీ రాజ్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేసిన ఘనత కూడా కాకాదే.

పేద దళితుల కోసం అంభేథ్కర్ పేరుతో ఎన్నో ఎడ్యుకేషనల్ సొసైటీలను ఆయన నెలకొల్పారు. 1973లో అంబేథ్కర్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా 9 కాలేజీలు నడుస్తున్నాయి. డొనేషన్స్ లేకుండా…విద్యార్ధులకు చదువు కల్పించడమే ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా…డా. బిఆర్ అంబేథ్కర్ పోస్ట్ గ్రాడుయేట్ సెంటర్ ద్వారా అంభేథ్కర్ డిగ్రీ కాలేజ్, లా కాలేజ్, జూనియర్ కాలేజ్, హై స్కూల్ లను స్థాపించారు వెంకటస్వామి.

కాకా… చిన్న తనం నుంచే…పోరాట భావాలు కలవారు. చిన్నతనంలో నిజాం వ్యతిరేకపోరాటంలో చురుగ్గా పాల్గొన్నవారిలో ఆయన ఒకరు. ఆర్యసమాజ్, రామానంత తీర్ధ శిష్యుడిగా కాంగ్రెస్ లో క్రియాశీల కార్యకర్తగా ఎదిగారు. స్వాతంత్ర పోరాటంలో జైలు కు కూడా వెళ్లారాయన. ఆయన జైల్లో ఉన్నప్పుడే దేశానికి స్వాతంత్యం వచ్చింది. పేదల, కార్మికుల హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా ఎదిగారు కాకా. కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్తగా జీవితం ప్రారంభించిన ఆయన నాటి ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు. ఆ తర్వాత కాలంలో ప్రధాని అయిన రాజీవ్ గాంధీకి, సోనియా కు కూడా ఆయన మంచి సన్నిహితుడే. స్వతంత్రంగా పనిచేయనిస్తేనే.. మంత్రిగా ఉంటానని సీఎంలకు చెప్పగలిగేంత..బలమైన నేత ఎవరైనా ఉన్నారంటే…ఆయనే కాకా.

సొంత రాష్ట్రంలో కాకాకు అరుదైన గౌరవం

తెలంగాణ సాధనకోసం అవిశ్రాంత పోరాటం, పేదల గూడుకోసం ఉద్యమం, కార్మికుల కోసం పెన్షన్ స్కీం. దళిత నాయకుడిగా ఎదిగి ప్రజల సంక్షేమం కోసం అంకితమైన కాకాకు చాలా కాలం సరైన గౌరవం దక్కలేదు. దుష్ప్రచారాలే ఎక్కువగా జరిగాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ఆయనకు తొలి గౌరవం, అరుదైన గౌరవం దక్కింది..అక్టోబర్ 5న. ఆ రోజు కాకా జయంతి సందర్భంగా…కేసీఆర్ తన చేతులు మీదుగా కాకా నిలువెత్తు విగ్రహాన్ని.. ట్యాంక్ బండ్ పై ఏర్పాటుచేశారు.

దివంగత గడ్డం వెంకటస్వామి విగ్రహం…అక్టోబర్ 5న ట్యాంక్ బండ్ సాగర్ పార్క్ లో కొలువుదీరింది. ఆయన 86వ జయంతి సందర్భంగా…ముఖ్యమంత్రి కేసీఆర్..ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణాను కళ్లారా చూడాలని పరితపించి …కల సాకారం చేసుకున్న మహనీయుడు కాకా అని సీఎం కేసీఆర్ అన్నారు.

అదే వేదికపై కాకా ఆత్మకథ మేరా సఫర్ ను కూడా విడుదల చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి…కాకా అని పార్టీలకతీతంగా వచ్చిన నాయకులు…కొనియాడారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ కాకా లాంటి మహానేత జీవిత చరిత్రను తెలంగాణా పాఠ్యపుస్తకాల్లో  చేర్చాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రభుత్వ సాకారం కావాలని… ఆయన అన్నారు.

హైదరాబాద్ లో సొంత గూడు సంపాదించుకున్న లక్షలమంది పేదవాళ్లు గుర్తు చేసుకునే పేరు. రిటైరై పెన్షన్ అందుకున్న కోట్లాది కార్మికులు మరిచిపోలేని వ్యక్తి. తెలంగాణ దళిత నేత కాకా. నిజాంపై పోరాటంతో మొదలై తెలంగాణ సాధన దాకా…చరిత్రకు ప్రత్యక్ష సాక్షి..ఆయన. అందుకే కాకా పేరు..తెలంగాణ ప్రజల గుండెల్లోనే కాదు… తెలంగాణ చరిత్రలోనే చిరస్థాయిలా నిలిచిపోయింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy