దశాబ్దాలుగా జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగింది: హరీశ్

harishమెదక్ జిల్లా ప్రజలకు ఇది శుభ దినమన్నారు మంత్రి హరీశ్ రావు. ఏఢు దశాబ్దాలలో జరగని అభివృద్ధి జిల్లాలో ఈ నాలుగేళ్లలో జరిగిందన్నారు. ప్రజల జిల్లా ఆకాంక్ష సాకారమైందన్నారు. మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల భవన సముదాయానికి ఈ రోజు(బుధవారం,మే-8) శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.  మిషన్ భగీరథ కింద మంచినీరు అందుతోందన్నారు. జిల్లాలో తండాలను గ్రామపంచాయతీలు. మూడు మున్సిపాలిటీలను చేసుకున్నామన్నారు. ఈ అభివృద్ధికి కేసీఆర్ సీఎం కావడమే కారణమన్నారు. కేసీఆర్ జిల్లాకు చెందిన వ్యక్తి కనుక ఆయనకు ఈ జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉండటంతో జిల్లా అభివృద్ధికి ఆయన అవసరమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు మంత్రి హరీశ్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy