దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు

1341588077_ahemadabadrs_10075దసరా… దీపావళి పండుగల సందర్భంగా మరిన్ని సౌకర్యాలు కల్పించింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని  వివిధ ప్రాంతాల మధ్య 117 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 14 నుంచి నవంబర్ 30 వరకు  నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
విశాఖ-సికింద్రాబాద్, కాచిగూడ-షిరిడి, సికింద్రాబాద్-విశాఖపట్నం, విశాఖ-తిరుపతి, షిరిడి-కాచిగూడ, తిరుపతి-కాకినాడ, నాంధేడ్-పుణే, కాకినాడ-తిరుపతి, విజయవాడ-విశాఖపట్నం, సికింద్రాబాద్-నాగర్‌సోల్, కాచిగూడ-గుంటూరు, విశాఖ-ధర్మవరం, నాగర్‌సోల్-సికింద్రాబాద్, గుంటూరు-కాచిగూడ, సికింద్రాబాద్-కాకినాడ, కాచిగూడ-గుంటూరు, విశాఖ-విజయవాడ, నర్సాపూర్-తిరుపతి తదితర ప్రాంతాల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నట్లు తెలిపారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy