దసరా ధమాకా : మార్కెట్లోకి నోకియా బనానా మోడల్స్

ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్ వచ్చిన కొత్తలో ఓ ఊపు ఊపేశాయి నోకియా ఫోన్లు. అయితే రకరకాల స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో..నోకియా కూడా న్యూ మోడల్స్ ని తీసుకొస్తోంది. సామాన్యుడికి అందుబాటులో ధరలు నోకియా సొంతం. ఇప్పుడు ఇదే ధరలను కాస్త పెంచి, కొత్త మోడల్స్ ని తీసుకొచ్చింది నోకియా. దసరా సందర్భంగా ఈ ఫోన్లను ఇవాళ(అక్టోబర్-11)  భారత్‌ లో లాంచ్‌ చేసింది.

ఒకటి స్మార్ట్‌ ఫోన్‌ కాగా, మరొకటి ఫీచర్‌ ఫోన్‌. ఈ రెండింటిన్నీ ఫిబ్రవరిలో జరిగిన 2018 ఎండబ్ల్యూసీలోనే హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటించింది. నోకియా 3.1 ప్లస్‌, నోకియా 8110 4జీ బనానా ఫోన్‌ పేర్లతో వీటిని మార్కెట్‌ లోకి తీసుకొచ్చింది.  నోకియా 3.1 ప్లస్‌ 3జీబీ ర్యామ్‌+32జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.11,499. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అక్టోబర్‌ 19న ఆఫ్‌ లైన్‌, ఆన్‌ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. ఎయిర్‌ టెల్‌ కస్టమర్లు నోకియా 3.1 ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌ కొంటే ..1టీబీ డేటా లభ్యం కానుంది. ఇక నోకియా 8110 4జీ ఫీచర్‌ ఫోన్‌ ను రూ.5,999కు లాంచ్‌ చేసింది. ఈ బనానా ఫోన్‌ అక్టోబర్‌ 24 నుంచి అందుబాటులోకి రానుంది. నోకియా 3.1 ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్లూ, బాల్టిక్‌, వైట్‌ రంగుల్లో అలరించనుంది.

నోకియా 3.1 ప్లస్‌ స్పెషిఫికేషన్లు…

6 ఇంచెస్ ఫుల్‌ స్క్రీన్‌ HD ప్లస్‌ డిస్‌ ప్లే
పైన, కింద సిమెంట్రికల్‌ బెజెల్స్‌
బ్యాక్ ప్యానల్‌ కు మెటల్‌ మాదిరి ఫినిస్‌, ఇది HMD  ఖరీదైన ప్లస్‌ ఫోన్లకు అందిస్తోంది
మీడియాటెక్‌ హిలియో పీ22 చిప్‌ సెట్‌
3GB ర్యామ్‌, 32B ఇంటర్నల్‌ స్టోరేజ్‌
400GB  మెమరీ
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
13MP + 5MP ప్రైమరీ సెన్సార్‌
8MP ఫ్రంట్ కెమెరా
3500 MAH బ్యాటరీ

నోకియా 8110 4G స్పెషిఫికేషన్లు…

ట్రెడిషినల్‌ బ్లాక్‌, బనానా యెల్లో రంగుల్లో అందుబాటు
కైఓఎస్‌ ఆధారిత స్మార్ట్‌ ఫీచర్‌ OSతో రన్‌ అవుతుంది
2.4 ఇంచెస్ QVGA డిస్‌ప్లే
బ్యాక్ 2 మెగాపిక్సెల్‌ కెమెరా
క్వాల్‌ కామ్‌ 205
గూగుల్‌ మ్యాప్స్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, ఫేస్‌ బుక్‌ యాప్స్‌ యాక్సస్‌
వైఫై హాట్‌ స్పాట్‌

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy