దాచేపల్లి రేపిస్ట్ మృతదేహం.. మున్సిపాలిటీకి అప్పగింత

rapeఏపీ రాష్ట్రం గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న సుబ్బయ్య మృతదేహాన్ని మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించారు.  గురజాల మండలం దైవ గ్రామంలోని అమరలింగేశ్వస్వామి ఆలయం సమీపంలోని.. ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు.. బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే దాచేపల్లిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో.. సుబ్బయ్య మృతదేహాన్ని తీసుకెళ్లటానికి బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. కుమారుడుకి నచ్చజెప్పారు. అయినా వినకపోవటం.. తండ్రితో సంబంధం లేదని.. మీరు ఏమైనా చేసుకోండి అని ఖరాఖండిగా తేల్చిచెప్పటంతో.. అంత్యక్రియల కోసం దాచేపల్లి మున్సిపాలిటీకి అప్పగించారు.

ఇదే సమయంలో దాచేపల్లిలోని బాధిత కుటుంబం, బంధువులు, స్థానికులు కొందరు ఆందోళనకు దిగారు. సుబ్బయ్య డెడ్ బాడీని ఇస్తే నడిరోడ్డుపై దహనం చేస్తాం అని.. అప్పుడే ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయంటూ నిరసనకు దిగారు. ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ఆందోళనకారులతో గుంటూరు రూరల్ ఎస్పీ చర్చించారు. తనకు తానే శిక్ష విధించుకున్నాడని నచ్చచెప్పారు. ఆందోళన విరమించాలని కోరారు. ప్రభుత్వం పరంగా చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని.. అండగా ఉంటామని హామీ ఇచ్చి నిరసనలను విరమింపజేశారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy