దాడిలో గాయపడిన బంగారం వ్యాపారి మృతి

HYDనేరేడ్ మెట్ లో దొంగల యాసిడ్ దాడిలో గాయపడిన బంగారం షాపు యజమాని చనిపోయాడు. ఈనెల 2వ తేదీన బంగారం రేటెంతో చెప్పాలంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. షాపు షటర్ వేసి యజమానిపై దాడికి దిగారు. బలవంతంగా యాసిడ్ తాగించి 15 తులాల బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. నగరంలో దొంగల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ముఠాగా ఏర్పడ్డ దొంగలు పక్కా స్కెచ్ తో దోచేస్తున్నారు. షాపులోకి వచ్చిన దుండగులు అభరణాలు చూపించాలంటూ యజమానిని మోహన్ ను అడిగారు. ఆభరణాలు చూపిస్తున్న క్రమంలో వాటిని బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించడంతో అతని తలపై సుత్తితోబాది.. నోట్లో యాసిడ్ పోశారు. షటర్ వేసి షాపులోని 15 తులాల బంగారంతోపాటు నగదును దోచుకుని పరారయ్యారు. యజమాని కేకలకు స్పందించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. 20 రోజలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయారు. లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి మోహన్ చనిపోయాడు. అయితే దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ చిన్న క్లూ కూడా కనుక్కోలేకపోయారని ఆరోపిస్తున్నారు యజమాని కుటుంబ సభ్యులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy