దాద్రి ఘటనలో ఇన్వెస్టిగేషన్ స్పీడప్

dadri-lynching-lయూపీలో టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. బీఫ్ ఇష్యూలో హత్యకు గురైన  ఇక్ లాఖ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేతలు క్యూకట్టారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్  రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరువల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరోవైపు ఇన్వెస్టిగేషన్  స్పీడప్ చేసిన పోలీసులు.. కేసులో ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బాధిత కుటుబానికి 20 లక్షల  ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్టు  ప్రకటించారు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్.

ఉత్తర్ ప్రదేశ్ లోని దాద్రి మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారుపోలీసులు. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ శివమ్, విశాల్ అనే మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బిశాద గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ ఉదయం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రాజకీయనేతలతో పాటు.. మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. మీడియా వాహనాలను ధ్వంసం చేశారు.

ఉదయం బిశాద గ్రామ సమీపంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో కేజ్రీవాల్, ఆప్ నేత అశుతోష్ ముఖర్జీ ఆందోళనకు దిగారు. చివరకు  అనుమతించడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేజ్రీవాల్… ఈ సంఘటన బాధాకరమన్నారు. రాజకీయలబ్ధికోసమే కొందరు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ గ్రామాన్ని విజిట్ చేసి…ప్రజలకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు… దాద్రి ఇష్యూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అన్నారు ఆర్జేడీ ఛీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. కేంద్రం ఆరెస్సెస్ ఎజెండాను అమలు చేస్తోందని ఆరోపించారు.

కేజ్రీవాల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడంపై బీజేపీ ఫైర్ అయ్యింది. సొంత రాష్ట్రంలో ప్రజలను పట్టించుకోని కేజ్రీవాల్.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ. ముందు ఢిల్లీలో పేదప్రజల సంగతి చూడాలంటూ సెటైర్స్ వేశారు. గ్రామంలోకి ఎవరినీ అనుమతించవద్దని జిల్లా మేజిస్ట్రేట్ కు  వాంగ్మూలం ఇచ్చారు దాడిలో తీవ్రంగా గాయపడిన సర్తాజ్. పరామర్శలతో తమ ఫ్యామిలికి నేతలు ఇబ్బంది కలిగించకూడదని కోరారు. గ్రామంలో కూడా పరిస్తితి ఉద్రక్తంగా ఉండటంతో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామంలోకి వెళ్లే దారులన్ని మూసేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy