దానం పై కోడిగుడ్లు,టమాటాల తో దాడి

danamకాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ పై  సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేశారు. ఉప్పల్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ గందరగోళంగా మారింది. దానం నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు…కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దానం నాగేందర్ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రమేనని, గ్రేటర్ పరిధిలోని తమ జిల్లాలోకి రావొద్దని కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా పార్టీ జెండా ఎగురవేసేందుకు దానం ప్రయత్నించడంతో ఆయనపై కోడిగుడ్లు, టమాటాలతో కార్యకర్తలు దాడి చేశారు.

danamనాపై ఎలాంటి దాడి జరగలేదు:దానం

తనపై ఎలాంటి దాడి జరగలేదన్నారు దానం నాగేందర్. ఉప్పల్‌లో జెండా ఆవిష్కరణ సందర్భంగా స్థానికంగా ఉండే రెండు వర్గాల మధ్య తోపులాట మాత్రమే జరిగిందన్నారు. తనపై ఎలాంటి దాడి జరగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో భిన్నభిప్రాయాలు సహజమేనని.. అందరం కూర్చోని సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు దానం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy