దారుణం.. ఇండియన్స్ ను బంధించి యూఏఈకి జై కొట్టించాడు

అబుదాబిలో జరిగిన సంఘటన ఇపుడు ఇండియా, అరబ్ కంట్రీస్ లో హాట్ టాపిక్ గా మారింది. గురువారం రోజున అబుదాబిలో AFC ఆసియా కప్ లో భాగంగా ఇండియా, యూఏఈ జట్ల మధ్య ఓ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. 2-0 తేడాతో గెలిచింది లోకల్ టీమ్ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు. ఈ మ్యాచ్ కు హాజరైన ఇండియా జట్టును సపోర్ట్ చేసేందుకు పెద్దసంఖ్యలో భారతీయులు స్టేడియానికి వచ్చారు. ఇక్కడే హక్కులు కాలరాసేలా… ఓ అమానుష చర్య జరిగింది.

స్టేడియానికి వచ్చిన ఇండియన్ పుట్ బాల్ టీమ్ సపోర్టర్స్ కొందరిని .. స్టేడియం ఆవరణలో ఉన్న పక్షుల పంజరంలో బంధించారు. ఆ బందీఖానా ముందు ఓ వ్యక్తి కట్టె పట్టుకుని వారికి కాపలాగా నిలబడ్డాడు. ‘మీరు ఏ టీమ్ ను సపోర్ట్ చేయడానికి వచ్చారు’ అని అడగ్గానే ఇండియా అని అందరూ బదులిచ్చారు. వెంటనే.. అక్కడున్న ఆ వ్యక్తి…. యూఏఈలో ఉంటూ వేరే జట్టుకు మద్దతిస్తారా అంటూ కర్రతో బెదిరించాడు. వెంటనే మళ్లీ అడిగాడు. ఈసారి.. యూఏఈకి సపోర్ట్ చేస్తాం అన్నారు. ఆ తర్వాత వారిని విడిచిపెట్టాడు ఆ వ్యక్తి.

ఈ వీడియో వైరల్ కావడంతో… యూఏఈ అటార్నీ జనరల్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ .. అందరినీ సమానంగా చూస్తుందని.. ఎవరి హక్కులను అణచివేయదని తెలిపింది. ఈ సంఘటనకు బాధ్యుడైన వ్యక్తిని… సహకరించిన మరికొందరిని అబుదాబి పోలీసులు అరెస్ట్ చేశారు.  “బాధిత భారతీయులంతా తనవద్ద పనిచేసేవారే.. సరదాకోసమే అలా వారిని పంజరంలో బంధించి లాక్ చేసినట్టు వీడియో రూపొందించా.. మా ఫార్మ్ హౌజ్ లోనే వాళ్లు పనిచేస్తారు.. అందరం ఒకే పల్లెంలో అన్నం తింటాం.. అర్థంచేసుకోండి” అంటూ పోలీసుల ముందు ఆ వ్యక్తి బతిమాలినట్టు అరబ్ పత్రికల్లో కథనాలు వచ్చాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy