దారుణం: యూపీలో గ్యాంగ్ రేప్

merital-rapeఎన్ని కఠిన చట్టాల తీసుకొచ్చినా.. దేశంలో ఏదోఒక మూలన కామాంధులు రెచ్చిపోతున్నారు.  మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. అంతేకాదు హత్యలు దోపిడీలకు కూడా తెగబడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ లో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం అర్ధరాత్రి  ఘోరం జరిగింది. దోపిడీ దొంగలు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలపై అత్యాచారానికి పాల్పడటమేగాక, ఆ ఇంటి యజమానిని హత్య చేసి నగలు, నగదు, ఫోన్లు దోచుకున్నారు. నోయిడాలో నివసించే పాత సామాన్ల వ్యాపారి షకీల్‌ ఖురేషీ (40)… బులంద్‌షహర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువును పరామర్శించేందుకు కుంటుంబంతో కలసి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. కారులో మొత్తం 8 మంది ఉండగా వారిలో నలుగురు మహిళలున్నారు. రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో కారు గౌతమ బుద్ధనగర్‌ జిల్లా జేవర్‌ పట్టణ దగ్గరలోని సబోటా అనే గ్రామ సమీపానికి రాగానే టైరు పంక్చర్‌ అయ్యేలా దుండగులు రోడ్డుపై మేకులు పెట్టారు. అయినా పంక్చర్‌ కాకపోవడంతో తుపాకీతో టైరును కాల్చారు. కారు ఆగగానే ఆయుధాలతో అక్కడకు చేరిన ఆరుగురు దోపిడీ దొంగలు..షకీల్‌ తల్లి, భార్య, చెల్లెలు, మరదలును పొలంలోకి లాక్కెళ్లి తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశారు. షకీల్‌ ప్రతిఘటించడంతో ఆయనను తుపాకీతో కాల్చి చంపారు. కారులోని మిగతా ముగ్గురి కాళ్లు, చేతులు కట్టేశారు.

బాధితుల దగ్గర నుంచి బంగారు నగలు, రూ.47 వేల నగదు, సెల్‌ఫోన్లను దోచుకుని దొంగలంతా అడవుల్లోకి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు  దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు  చేపట్టారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy