దారుణం : విష ప్రయోగంతో 100 కోతులు మృతి

UP-100-Monkeys-Diedఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. విష ప్రయోగంతో 100 కోతులు మృతి చెందాయి. అమ్రోహ జిల్లా దబ్రాసి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక విచారణలో అవి విషం కారణంగానే చనిపోయినట్లు తేలింది. అయితే కొందరు గ్రామస్తులు మాత్రం నూడిల్స్‌ కోసం వాడే చట్నీ తిని అవి చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ రంగంలోకి దిగింది. పోస్టు మార్టం రిపోర్ట్‌ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు అధికారులు. మరోవైపు కోతుల బాధల నుంచి తప్పించుకోవడానికే ఈ విష ప్రయోగం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల కోతులను తరిమికొడుతుండగా..ఇప్పుడు విషప్రయోగంతో చనిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైతే అడవుల్లో వదిలేయాలి కానీ..ఇలా చంపుతారా అంటు సీరియస్ అవుతున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy