దావూద్..కేంద్రంతో టచ్ లోనే ఉన్నాడు: రాజ్ థాకరే

rajthackeray-davoodమహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి ఫేస్‌బుక్‌లోకి వచ్చిన ఆయన.. ఓ సంచలన విషయాన్నితెలిపారు. 1993 ముంబై పేలుళ్ల నిందితుడు… అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇండియాకు తిరిగి వచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడన్నారు రాజ్ థాకరే. అంతేకాదు అతన్ని ఇండియాకు తీసుకొచ్చి ఇది తమ విజయంగా బీజేపీ చెప్పుకొనే ప్రయత్నం చేయనుందని చెప్పుకొచ్చారు.

ముంబై పేలుళ్ల తర్వాత అప్పటి నుంచి దావూద్..పాకిస్తాన్‌లోని కరాచీలో తలదాచుకుంటున్నాడని తెలిపారు. మూడు ఖండాల్లోని 12 దేశాల్లో అతని నెట్‌వర్క్ విస్తరించి ఉందన్నారు. ఫేస్‌బుక్‌లోకి గురువారం (సెప్టెంబర్21) ఎంటరైన రాజ్ థాకరే.. బీజేపీపై మరిన్ని ఆరోపణలు చేశారు. EVMలను బీజేపీ రిగ్ చేసిందని కూడా ఆరోపించారు. ప్రతి ఓటు బీజేపీకి వెళ్తుంటే.. ఎన్నికల్లో పోటీ చేసి లాభం లేదని ఆయన అన్నారు. థాకరే ఫేస్‌బుక్‌లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన ప్రొఫైల్‌కు 4.39 లక్షల లైక్స్, 4.43 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. పార్టీ కార్యకర్తలతో టచ్‌లో ఉండటానికే ఫేస్‌బుక్‌లోకి వచ్చినట్లు థాకరే తెలిపారు.

Raj Thackeray On Facebook

तुमच्याशी फेसबुकवर बोलायला मी येत आहे…

Raj Thackeray 发布于 2017年9月20日周三

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy