దాహం..దాహం : అడుగంటిన భూగర్భజలాలు

waterమండుటెండలకు  తాగునీటి  కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి కోసం బిందెలతో కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులను.. బావులను ఆశ్రయిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో..బోర్లు పనిచేయడంలేదు. దీంతో ఆయా గ్రామస్థులు తాగు నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు.

వేములవాడ  రాజన్న ఆలయ  ధర్మసత్రాలలో…నీటి కొరతతో  భక్తులు  తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు.  వేములవాడ  పట్టణానికి,  రాజన్న ఆలయానికి  రెండింటికి  ముఖ్యమైన  రాజన్న గుడి  చెరువును…  అభివృద్ది  పేరుతో  పూర్తిగా  పూడ్చివేయడంతో  నీటి సమస్య  మొదలైంది. ప్రత్యామ్నాయంగా  భక్తులకు  కనీస సౌకర్యాలు  కల్పించడంలో  అధికారులు  నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్నారని  మండిపడుతున్నారు  భక్తులు. వేములవాడ పట్టణ ప్రజలకు, రాజన్న ఆలయాన్ని వచ్చే భక్తులకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ పట్టణ ప్రజలు మాత్రం ఒక్కో ట్యాంకర్ 5వందలు పెట్టి మరీ కొంటున్నారు.

కరీంనగర్ జిల్లా  పల్లెల్లో ప్రజలు  తాగునీటి  కష్టాలు పడుతున్నారు. భూగర్భ జలాలు  తగ్గిపోవడం,  మంచినీళ్లు   అందించే  ప్రాజెక్టుల్లో  నీటి మట్టం  దారుణంగా  పడిపోవడంతో …నీటి ఎద్దడి ఎర్పడింది. కొన్ని  ఊళ్లలో  వ్యవసాయ  బోర్లను  అద్దెకు తీసుకుని  తాగునీరు సరఫరా  చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో  నీటికొరత  తీవ్రంగా ఉండటంతో..  కిలోమీటర్ల  కొద్ది  నడిచి …బిందెలతో  తాగునీళ్లు  తెచ్చుకుంటున్నారు అక్కడి జనం.  ఎన్ని బోర్లు  వేసినా  ఫలితం లేకపోయింది. దీంతో తెల్లారక ముందు  నుంచే  నీటి వేటకు వెళ్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మండే ఎండలకు పల్లెల గొంతు ఎండుతోంది. బిందెలు పట్టుకుని కిలోమీటర్ల దూరం తిరగాల్సి వస్తోందంటున్నారు. చేదబావుల్లో, చెలిమల్లో నీళ్లు తాగితే.. రోగాలు వస్తున్నాయంటున్నారు.  తమ ఊర్లకు పైపులైన్లు వేసి నీటి సరఫరాచేయాలని లేకుంటే ట్యాంకర్ల సరఫరా చేయాలని కోరుతున్నారు జనం. బిందె  నీటి కోసం  జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పల్లె, పట్టణాల ప్రజలు.

ప్రిల్ నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. చాలా చోట్ల మంచి నీళ్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తండాలు, మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మూడు, నాలుగు రోజులకు ఒకసారైన నీళ్లు రావడం లేదని తండా వాసులు అంటున్నారు. కొన్ని గ్రామాల్లో నల్లాలు పని చేయకపోవడంతో, దగ్గరలోని వ్యవసాయ బోర్ల దగ్గర నీటిని తీసుకొస్తూ ఇబ్బంది పడుతున్నారు మహిళలు.  నీళ్లు లేని ప్రాంతాలవాళ్లు.. పక్కనున్న  గ్రామాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. నీళ్ల విషయంలో పక్క ఊరి వాళ్లతో గొడవలు జరుగుతున్నాయని చెబుతున్నారు.




Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy