దిగొచ్చాయ్.. సంచి నిండా కూరగాయలు

vegకూరగాయల  ధరలు దిగొస్తున్నాయి.  నిన్నమొన్నటి వరకు మండిపోయిన రేట్లు అందుబాటులోకి  రావడంతో  మార్కెట్లన్నీ జనంతో  నిండిపోతున్నాయి. వంద రూపాయలు పెట్టినా అరకొర  కూరగాయలతో  ఇంటిముఖం పట్టినవారు..ఇపుడు ధరలు  తగ్గడంతో ఖుషీ అవుతున్నారు.

కూరగాయల ధరలు తగ్గుతున్నాయి. నిన్నటి వరకు ఆకాశాన్నంటిన ధరలు ఇప్పుడిప్పుడే దిగొస్తున్నాయి. వారం కిందట  ఉన్న ధరలు ఇప్పుడు లేవు. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండడంతో రేట్లన్నీ అందుబాట్లకు వచ్చాయి. కూరగాయలు ధరలు తగ్గడంతో జనం ఖుషీ అవుతున్నారు.

రేట్లు తగ్గడంతో పంటకి పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రావడం లేదంటున్నారు రైతులు. ఆకుకూరలు అయితే వర్షంపడి మొత్తం ఖరాబ్ అవుతున్నయంటున్నారు. ధరలు తగ్గినా కూడా కూరగాయలు ఎక్కువగా అమ్ముడు పొవడంలేదంటున్నారు రైతులు.  బయట మార్కెట్లలో కూడా నాలుగైదు రూపాయల తేడా ఉండడం వల్ల జనం రైతు బజార్లకు వస్తాలేరంటున్నారు. అయితే ఎంతకాలం ధరలు తక్కువగా ఉంటాయో కూడా తెలియదంటున్నారు. ఏ కూరగాయలైనా కిలోకు 20 నుంచి 30 రూపాయల మధ్యనే ఉంటున్నాయి. వర్షాలు బాగాపడి కూరగాయలు ఎక్కువ రావడంతో రేట్లు పడిపోయాయి. ధరలు తగ్గడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు రైతు బజార్ ఆఫీసర్లు.

కాయగూరల ధరలు దిగిరావడంతో జనం సంచినిండా కొంటున్నారు. కానీ రైతులు మాత్రం వర్షాలతో పాటు ధరలేక ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy