దిగ్విజయ్, పొన్నాలను తొలగించాలని కోరాం..

palvaiకాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్వాయి గోవర్ధర్ నెడ్డి, సర్వే సత్యనారాయణ పార్టీ ప్రసిడెంట్ సోనియాగాంధీని వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా పాల్వాయి మాట్లాడుతూ.. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరినట్లు తెలిపారు. పీసీసీని రీఆర్గనైజ్ చేసి యువకులను నియమించాలని కోరామన్నారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లే వారిని, పార్టీ కోసం కష్టపడేవారికి అవకాశం ఇవ్వాలని సోనియాతో చెప్పినట్లు తెలిపారు. కాంగ్రెస్ మీద గెలిచి స్వార్థానికి పార్టీ వీడి వెళ్లిన ఎమ్మెల్సీల గురించి ఆలచించాల్సిన అవసంర లేదని సోనియా చెప్పిందన్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటన్నది చర్చించినట్లు తెలిపారు. సీపీఐ తో పొత్తు అనవసరం గా పెట్టుకున్నామని .. సీట్లు వదలలి పెట్టడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇక రాహుల్ సర్వే వల్ల కొంతమందికి టికెట్లు ఇవ్వలేదని, అది కూడా నష్టం కలిగించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని పునరుద్ధరించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని మేడంకు చెప్పానన్నారు. ఏఐసీసీ నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు ప్రక్షాళన జరగాలని,  రాష్ట్ర ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ ను, పీసీసీ చీఫ్ ను కూడా తొలగించాలని కోరినట్లు తెలిపారు.

Sarve_Satyanarayanaరెండు ప్రాంతాల్లో ఓటిమికి మేడం బాధపడ్డారు : సర్వే

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల్లో ఓడిపోవడం బాధ కలిగించిదని సోనియా అన్నట్లు సర్వే సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ ఇచ్చి కూడా లాభం లేదని సోనియా బాధ పడ్డారని అన్నారు. అక్కడ సీమాంధ్ర లో కూడా పార్టీని కోల్పోయామని అన్నారు. ఎమ్మెల్సీలు వెళ్లిపోవడంపై విచారణ వ్యక్తం చేసినట్లు తెలిపారు. పార్టీని ఏవిధంగా కాపాడుకోవాలని చర్చించినట్లు తెలిపారు. రేపు ఏఐసీసీ భీటీలో పార్టీ తర్వాతి కార్యాచరణ ఏంటన్నదానిపై చర్చించనున్నట్లు తెలిపారు. కొన్ని స్టేట్స్ లో ఎలక్షన్స్ ఉన్నాయని, అక్కడ పారటీని ఎలా గెలిపించుకోవాలని చర్చించనున్నట్లు తెలిపారు. ఇక టీఆర్ఎస్ తో అలయెన్స్ పెట్టుకుంటే బాగుండేదని చెప్పినట్లు తెలిపారు. ఇక్కడి లీడర్లు సరైన రీతిలో నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో దేశంలో పార్టీని బతికించుకునేందుకు సోనియా ఎలాంటి ఆదేశాలిచ్చినా పాటిస్తామని సర్వే అన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy