దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ : ‘స్పైడర్‌’ ఓవర్సీస్‌ రైట్స్

3brk-mahesh-157aప్రిన్స్ మహేష్ బాబు  ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘స్పైడర్’ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ రోజుకోకటి బయటికొస్తున్నాకొద్ది సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న  ‘స్పైడర్‌’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ సినిమాలోని ‘బూమ్‌ బూమ్‌’ అనే సాంగ్ ని ఇటీవలే సినిమా టీం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలుండటంతో ‘స్పైడర్‌’ హక్కుల కోసం పోటీ నెలకొందని.. వివిధ ఏరియాల్లో భారీ రేటుకు అమ్ముడుపోయిందని వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రం తమిళ వెర్షన్‌ హక్కులను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ దక్కించుకుంది. రూ.25 కోట్లు వెచ్చించి ఈ సంస్థ హక్కులు కొనుగోలు చేసిందని.. మహేశ్‌ చిత్రాల్లో ఇదే అత్యధికమని కోలీవుడ్‌ టాక్‌.  ఓవర్సీస్‌ హక్కులు సైతం భారీ రేటుకు ఓ సంస్థ తీసుకున్నట్లు చెబుతున్నారు. తెలుగు వెర్షన్‌ను రూ.15 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారని.. ఇక తమిళ వెర్షన్‌కు రూ.8 కోట్లు ధర పలికిందని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో మహేశ్‌ గత చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించడం… మురుగదాస్‌ దర్శకుడు కావడంతో ఈ స్థాయి ధర పలికినట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మహేశ్‌ ఈ చిత్రంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆఫీసర్‌గా కన్పిస్తారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ చిత్రం రెండో టీజర్‌ను విడుదల చేయనున్నారు. రకుల్‌ప్రీత్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జే సూర్య, ప్రియదర్శి, ఆర్‌జే బాలాజీ తదితరులు ప్రధాన పాత్రల్లో కన్పిస్తారు. హారిస్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌వీఆర్‌ సినిమా పతాకంపై ఎన్‌వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy