దిమ్మతిరిగే నమ్మలేని నిజం : పులులకు ఆహారంగా వృద్ధులు

old-personటైటిల్ చూడగానే కోపం వచ్చి ఉంటుంది.. ఫేక్ న్యూస్ అంటూ ఒక్క మాట అనేయొచ్చు.. ఇలా కూడా జరుగుతుందా అని కూడా ప్రశ్నించుకోవచ్చు. కానీ ఇదంతా పచ్చి నిజం. వాస్తవం. భారతదేశంలోనే జరగుతున్న తంతు. ఎక్కడో కాదు దేశరాజధాని ఢిల్లీకి పక్కనే ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన నిజం ఇది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లో పిలిబిత్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఈ అటవీ ప్రాంతంలోనే కొన్ని తండాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో పొలాల్లో వృద్ధుల అస్తిపంజరాలు కనిపిస్తున్నాయి. పులులే మా వాళ్లను చంపేస్తున్నాయని చెప్పి.. అటవీ శాఖ నుంచి నష్టపరిహారం పొందుతున్నాయి ఆయా కుటుంబాలు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు వరసగా ఏడు వచ్చాయి. దీనిపై ఎంక్వయిరీ వేసిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు కఠోర వాస్తవాలు తెలిశాయి.

తండాలు, గూడెంలలో పెద్ద సంఖ్యలో వృద్ధులు ఉన్నారు. వీరి పోషణ ఆయా కుటుంబాలకు భారంగా మారింది. ప్రభుత్వం నుంచి కూడా ఈ వృద్ధులకు ఎలాంటి సాయం అందటం లేదు. వీరిని వదిలించుకోవటానికి ఆయా కుటుంబలకు చెందిన వాళ్లు.. వీరిని తీసుకెళ్లి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వదిలేస్తున్నారు. నడవలేని.. పరిగెత్తలేని.. నిశ్సాహాయులైన వాళ్లను పులులు తిరిగే ప్రాంతంలో వదిలేసి వస్తారు. రెండు రోజుల తర్వాత వెళ్లి చూస్తారు. అప్పటికే ఆ వృద్ధుడు పులికి ఆహారంగా మారి ఉంటాడు. అస్తిపంజరమే ఉంటుంది. ఆ ఎముకలను తీసుకొచ్చి.. తండాలు, గూడెంకి సమీపంలోని పొలాల్లో పడేస్తారు. పులి దాడి చేసింది అని చెప్పి అటవీ శాఖ నుంచి నష్టపరిహారం పొందుతారు.

ఇలా ఎందుకు చేస్తున్నారు అని అధికారులు నిలదీస్తే.. మేం బతకటానికే కష్టంగా ఉంది.. ఇంట్లో ఈ వృద్ధులను ఎలా సాకాలి. వాళ్లకు తిండి కూడా పెట్టలేకపోతున్నాం.. దానికితోడు అనారోగ్యం. మందులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం. అందుకే ఇలా చేస్తున్నాం. అటు పులులకు ఆహారంగానూ ఉంటుంది.. మా కుటుంబానికి ఆర్థిక వెసలుబాటు వస్తుంది అని చెబుతున్నారంట. ఈ దిమ్మతిరిగే నిజాన్ని విని ఫారెస్ట్ ఆఫీసర్స్ సైతం తట్టుకోలేకపోయారు. వెంటనే యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy