దిల్ రాజుపై కేసు నమోదు

dilraju11496001025ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై మాధాపూర్ పీఎస్ లో కేసు నమోదైంది. శ్యామలా రాణి అనే రచయిత్రి తన అనుమతి తీసుకోకుండా తన ‘నా మనసు కోరింది నిన్నే’ నవల ఆధారంగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తీశారని పోలీసులను ఆశ్రయించారు. ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2011లో ఆగస్టులో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. అయితే ఇన్నేళ్ల తరువాత కేసు వేయటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమాలో ప్రతీ సీను తన నవలలో ఉన్నట్టుగానే చిత్రీకరించారని ఆరోపించిన శ్యామల, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరథ్ లపై 120 ఎ, 415, 420, తో పాటు కాపీ రైట్ యాక్ట్ సెక్షన్ 63 కింద కేసు నమోదు చేశారు. ఇటీవల టీవీలో ప్రసారం అయినప్పుడు సినిమా చూసిన శ్యామల నిర్మాతపై ఆరోపణలు చేయకుండా ఎవరో తన కథను వాళ్ల కథగా దిల్ రాజుకు వినిపించారని తెలిపారు. సినిమాలో 28 సీన్లు తన నవల ఆధారంగానే తెరకెక్కాయని, ఇక మీదట మరే భాషలో అయిన ఈ సినిమా రీమేక్ చేస్తే తన పేరును టైటిల్ లో వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy