దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లకు నాలుగేళ్లు

dilsukhnagar-blastహైదరాబాద్ నగరం ఉలిక్కిపడిన రోజు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు దిల్ సుఖ్ నగర్ జంటపేలుళ్లు నగరవాసులను వణుకుపుట్టించాయి. ఈ దుర్ఘటన జరిగి నేటికి నాలుగేళ్లు. ప్రధాన నిందితున్ని ఇంకా పట్టుకోలేక పోయారు అధికారులు. ఏ1 నిందితుడు.. రియాజ్ బత్కల్ పరారీలో ఉన్నాడు. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 7 గంటలకు ఒకటి కోణార్క్ థియేటర్ దగ్గర పేలగా.. మరొకటి వెంకటాద్రి బస్ స్టాప్ ప్రాంతంలో పెద్ద విధ్వంసాన్నే సృష్టించింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. 138 మంది గాయపడ్డారు. నేటికి ఈ గాయాలు మానలేదు.

దిల్ సుఖ్ నగర్ జంటపేలుళ్ల కేసులో డిసెంబర్ 19న దోషులకు శిక్ష ఖరారు చేసింది NIA ప్రత్యేక కోర్టు. ఐదుగురు దోషులకు ఉరి శిక్ష వేసింది. ఆరుగురు నిందితులలో ఐదుగురిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం. రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్ నిందితులుగా ఉన్నారు. ప్రధాన నిందితుడు ఏ1 రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. మిగతా ఐదుగురిపై విచారణ జరిగింది.

2013 ఫిబ్రవరి 21న  దిల్ సుఖ్ నగర్ లోని A1 మిర్చి సెంటర్, వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న బస్టాప్ దగ్గర ఈ జంట పేలుళ్ళు జరిగాయి. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు జరిపిన ఈ బ్లాస్ట్ లో 18 మంది ప్రాణాలు కోల్పోగా…  138 మంది గాయపడ్డారని 157 మందితో సాక్ష్యుల స్టేట్ మెంట్ నమోదు చేసింది NIA కోర్టు. కీలకమైన 502 డాక్యుమెంట్లను సేకరించిన NIA అధికారులు.. ఘటనా స్థలంలో 201 మెటీరియల్స్ సీజ్ చేశారు. వీటన్నింటిపై NIA తరపున బలమైన వాదనలు వినిపించారు. మూడు చార్జీషీట్లు దాఖలు చేశారు.

చార్జీషీట్ దాఖలుకు ముందు ఇద్దరు.. ఆ తర్వాత మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది NIA. మరో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పాకిస్థాన్ లో ఉంటూ ఇండియాలో పేలుళ్ళకు పాల్పడుతున్నాడని చార్జిషీట్ లో తెలిపింది.  పేలుళ్లకు అవసరమైన ఆర్థిక సాయం ఎజాజ్ చేశాడని గుర్తించారు NIA అధికారులు.

కేసు నాంపల్లి  క్రిమినల్ కోర్టులో ఉన్నా NIA ప్రత్యేక కోర్టులో విచారణ జరిపారు. ఆ తర్వాత రంగారెడ్డి కోర్టుకు మార్చినా.. ఇబ్బందులు రావడంతో చర్లపల్లి జైలులోనే ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటు చేశారు.  ఏడాది కాలంగా అక్కడే కేసు విచారణ కొనసాగించారు. చివరికి ఐదుగురికి ఉరిశిక్షను ఖరారు చేసింది కోర్టు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy