‘దీనదయాళ్‌ కౌశల్య యోజన’ తో జిల్లాకో ఉద్యోగమేళా

JOBSయువతకు ఉద్యోగాలను కల్పించేందుకు తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లాకో ఉద్యోగమేళాను నిర్వహించనుంది. ఈ శిక్షణ కార్యక్రమాలకు కేంద్రం నిధులను, మౌలిక వసతులను సమకూర్చనుంది. ఈ ఏడాది అదనంగా 50 వేల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు కావాల్సిన నిధులను అందజేయాల్సిందిగా తెలంగాణ కేంద్రాన్ని కోరింది. ట్రైయినింగ్ పొందిన వారికి మూడు నెలల్లో ఉపాధి లభించేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. స్వయంఉపాధి ప్రారంభించేవారికి, వివిధ వృత్తులను నిర్వహించుకొంటూ వాటిలో అవగాహన పొందాలనుకునేవారికి నైపుణ్యంలో శిక్షణ అవసరం. ఇది పూర్తిచేసుకొన్నవారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పనా కీలకమైనవే. ఇటువంటి కార్యక్రమాల కోసం కేంద్రం ‘దీనదయాళ్‌ గ్రామీణ కౌశల్య యోజన’ను అమలు చేస్తోంది.

జాతీయ బ్యాంకులు ‘గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ’లను నిర్వహిస్తున్నాయి. కౌశల్య యోజన, బ్యాంకుల శిక్షణ సంస్థల ద్వారా భారీగా కార్యక్రమాలను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రాలకు చేసిన సూచనల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో 15-35 ఏళ్ల మధ్య వయసున్న వంద మంది పేర్లను నమోదు చేయాలి. వారిలో 45 మంది మహిళలుండాలి. నమోదు చేసుకొన్నవారిని సమీకరించేందుకు అవసరమైన శిబిరాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేసేదీ సెప్టెంబరు 10లోగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించాలి. ఉద్యోగమేళాల ద్వారా ఆయా పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపట్టాలి. కనీస శిక్షణ.. కొత్తగా ఉపాధిని పొందుగోరేవారికి 200 గంటలు ఉండాలి. శిక్షణ పొందిన వారిలో 70 శాతం మందికి ఉపాధి లభించేలా చర్యలు చేపట్టాలి.

మూడేళ్లలో 18 వేల మందికి ఉద్యోగాలు
తెలంగాణలో  ‘దీనదయాళ్‌ కౌశల్య యోజన’ కింద గత మూడేళ్ల వ్యవధిలో 18వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు గ్రామీణాభివృధ్ది శాఖ అధికారులు చెప్పారు. 2017-18లో సాధారణంగా మంజూరు చేసే సంఖ్య కంటే అదనంగా 50 వేల మంది శిక్షణకు అవసరమయ్యే నిధులను ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కోరినట్లు సమాచారం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy