దీని ఆచూకీ తెలిపితే రూ. 50 వేలు నజరానా

36B0DEC800000578-3714120-image-a-1_1469777618733ఈ ఫొటోలో ఉన్న పులి కనపడుట లేదు. తీసుకొచ్చినవారికి 50వేల రూపాయల నజరానా.. ఆశ్చర్యంగా ఉంది కదూ… ఈ ప్రకటన విడుదల చేసింది మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన ఉమ్రెద్ ఖర్హండ్లా వన్యప్రాణి జంతురక్షణ కేంద్రం అధికారులు. ఈ పులి గత మూడు నెలలుగా కనపడటం లేదు. అయితే ఏంటట అనుకుంటున్నారా.. ఈ పులి గురించి చెబితే మీరు కూడా వెతకడం మొదలు పెడతారు. దీని పేరు జై. షోలే సినిమాలోని అమితాబ్ బచ్చన్ పేరే దీనికి పెట్టారు. నాగ్ పూర్ లోని  ఉమ్రెద్ ఖర్హండ్లా వన్యప్రాణి జంతురక్షణ కేంద్రంలో ఉంటుంది. ఇప్పటి వరకు 20 పులి పిల్లల జన్మకు కారణమైంది. దేశంలో పులుల సంతతి పెంచడంలో కీలక పాత్రపోషిస్తుందంటూ ఆ సంరక్ష కేంద్రం అధికారులు దీన్ని ప్రత్యేకంగా చూస్తుంటారు. అయితే సడన్ గా మూడు నెలల నుంచి కనపడకుండా పోయింది జై. అప్పటి నుంచి వెతుకుతున్నా కనపడటం లేదు. శుక్రవారం వరల్డ్ టైగర్ డే కావడంతో… జై ఆచూకీ తెలిపినవారికి 50వేలు నజరానా అంటూ ప్రకటన విడుదల చేశారు. అయితే అది ఏ గాయాలు అయ్యి ఎక్కడో ఉండిపోయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాపం అధికారులు మాత్రం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy