దీన్‌దయాళ్ రైల్వే స్టేషన్‌గా మొగల్ సురాయ్ జంక్షన్

mugalsuraiప్రాంతాల ప్రాముఖ్యతలకు అనుగుణంగా పాత పేర్లను మార్చి వాటికి కొత్త పేర్లు పెడుతున్నారు.ఇందులో భాగంగానే ప్రఖ్యాత మొగల్ సురాయ్ రైల్వే స్టేషన్ పేరును మార్చారు. ఆ స్టేషన్‌ను ఇక నుంచి పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యా జంక్షన్‌గా పిలువనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను యూపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. స్టేషన్ పేరు మార్చాలని గతేడాది ప్రవేశపెట్టిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు తెలియజేసింది.

1968లో ఇదే రైల్వే స్టేషన్‌లో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ స్టేషన్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌ఫామ్‌పై ఆయన మృతదేహాం లభ్యమైంది. స్టేషన్ పేరు మార్చాలన్న ప్రతిపాదనను సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంట్‌లో వ్యతిరేకించింది. అయినా బీజేపీ మాత్రం ఆ పేరును మార్చేందుకు ముందుకు వెళ్లింది. 1800లో మొగల్ సురాయ్ స్టేషన్‌ను బ్రిటీషర్లు కట్టించారు. ఢిల్లీ నుంచి కోల్‌కతా మధ్య ఉన్న రూట్లో ఈ స్టేషన్ కీలకమైంది. దేశంలోనే ఇది నాలుగో బిజీ రైల్వే స్టేషన్‌.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy