దీపావళికి వస్తున్న ‘కార్తికేయ’…

downloadపండక్కి ‘కార్తికేయ’ వస్తున్నాడు. దసరాకే వద్దామని ముందుగా అనుకున్నా.. పెద్ద సినిమాల కారణంగా ‘కార్తికేయ’ మూవీ రిలీజ్ కాస్త పోస్ట్ పోన్ అయింది. దీంతో దీపావళి సందర్భంగా ఈ నెల 24న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తమిళం, తెలుగు రెండు భాషల్లో ఒకేసారి మూవీని నిర్మించినట్లు వారు చెప్పారు. తమిళనాడు-ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న పాత గుడి  వెనక దాగున్న మిస్టరీ ఆధారంగా మూవీని రూపొందించినట్లు నిర్మాతలు చెప్పారు. మాగ్నస్ సినీ ప్రెమ్ బ్యానర్ పై వెంకట శ్రీనివాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా, థ్రిల్లర్ తరహాలో మూవీ సాగుతుందని నిర్మాతలు చెప్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy