దీపావళి ఐదు గంటలే..!

fire-crackersవచ్చే దీపావళిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లానింగ్ లో ఉన్నట్టున్నారు. అప్పుడే లెక్కలు… టపాసుల కంపెనీలపై ఆరాలు అన్నీ కూడా మొదలైనట్టున్నాయి. అయితే 27వరకు ఆగి ఆ తర్వాత లెక్కలు వేసుకోండి. ఎందుకంటారా..? ఆ రోజు దీపావళి సంబరాలపై సుప్రీం తీర్పు ఇవ్వనుంది. ఆనాటి టపాసుల మోతపై సుప్రీం గడువు విధించనున్నది. గత సెప్టెంబర్ 30న నెలల వయస్సున్న ముగ్గురు చిన్నారులు దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం కోర్టు.. శుక్రవారం విచారించింది సుప్రీం కోర్టు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం… తీర్పును ఈ నెల 27కు వాయిదా వేసింది.

ఆరు నెలల వయస్సున్న గోపాల్, ఆరవ్ భండారీ.. 14నెలల వయసున్న జోయా రావ్ భాసిన్ అనే చిన్నారులు తమ న్యాయవాద తండ్రుల ద్వారా పిటిషన్ వేశారు. “ఎదిగీఎదగకుండా ఉన్న మా అవయవాలు, అంతరభాగాలపై టపాసుల శబ్ధ, వాయు కాలుష్యాలు తీవ్ర ప్రభావం చూపుతాయి .. దీనిపై ఆలోచించండి” అని పిటిషన్ లో కోరారు చిన్నారులు.  చిన్నారుల అభ్యర్థనలను పరిశీలించిన… చీఫ్ జస్టీస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ అమితాబ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం పిల్లల ఆందోళన సహేతుకమైందని… తగిన చర్యలు చేపట్టేలా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడాల్సిందిగా సొలిసిటర్ జనరల్ రజిత్ కుమార్, అదనపు సొలిసిటర్ జనరల్ మనీందర్ సింగ్ లను కోర్టు ఆదేశించింది.

పటాసుల పేల్చే కార్యక్రమాన్ని రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరగా.. రెండు గంటలు చాలా తక్కువ సమయమని… వేడుక జరపడానికి కనీసం ఐదు గంటలైనా ఉండాలని కోర్టు అభిప్రాయ పడింది. టపాసుల పేల్చి వేత కార్యక్రమాన్ని సాయంత్రం ఐదు నుంచి 10 వరకు ఉంచితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు న్యాయమూర్తులు. దీనిపై విచారణను 27కు వాయిదా వేశారు. సొలిసర్ జనరల్ ఇచ్చే తీర్పును బట్టి ఆరోజే తీర్పు ఇచ్చే అవకాశముంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy