దుబాయ్ సిరీస్ సెమీస్ లో సింధు

sindhuభారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. దుబాయ్ సూపర్ సిరీస్ లో సత్తా చాటింది.  సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. టోర్నీలో తనదైన జోరును కొనసాగిస్తూ రెండో రౌండ్‌లో సింధు 21-13, 21-12 తేడాతో సయాకా సాటో(జపాన్)ను చిత్తుచేసింది. ఆది నుంచే పదునైన స్మాష్‌లు, డ్రాప్‌షాట్లు, నెట్‌గేమ్‌తో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఏ దశలోనూ అవకాశమివ్వకుండా వరుస పాయింట్లతో జపాన్ అమ్మాయిని ఒత్తిడిలోకి నెట్టేసింది. తొలి గేమ్‌లో3-3తో సమమైనా ఆ తర్వాత ఎక్కడా వెనుకకు తగ్గకుండా గేమ్‌ను కైవసం చేసుకుంది. అదే జోరులో రెండో గేమ్‌ను అలవోకగా గెలిచి మ్యాచ్‌ను దక్కించుకుంది. ఈ సీజన్‌లో సయాకాను ఓడించడం సింధుకు రెండోసారి. తన తదుపరి మ్యాచ్‌లో ఈ తెలుగు షట్లర్ శుక్రవారం యమగుచి(జపాన్)తో తలపడుతుంది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్‌లో శ్రీకాంత్ 18-21, 18-21తో తీన్‌చెన్(చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మొదటి నుంచే కొంత తడబడ్డ శ్రీకాంత్..ప్రత్యర్థిని నిలువరించే క్రమంలో విఫలమయ్యాడు. తన సహజశైలికి విరుద్ధంగా ఆడి ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకున్నాడు. ఇప్పటికే అక్సెల్‌సన్ చేతిలో ఓడిన శ్రీకాంత్ నామమాత్రపు మ్యాచ్‌లో యుకీ(చైనా)తో ఆడతాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy