దుబాయ్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం

dubai hotelదుబాయ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  సిటీలోని ది అడ్రస్ డౌన్ టౌన్ హోటల్ లోని 20వ అంతస్థులో మంటలు అంటుకొని హోటల్ అంతా వ్యాపించాయి. గురువారం రాత్రి 9.50 గంటల సమయంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. న్యూ ఇయర్ సంబరాల్లో ఉన్న జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 14 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు తెలుస్తోంది. సమయానికి ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది.

 

burj-fire-475 dubai-fire

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy