దుమారం : కదిలే బస్సులో పొలిటికల్ లీడర్ అరాచకం

bjp leader rape

కదులుతున్న బస్సు.. ముందు సీట్లలో ప్రయాణికులు ఉన్నారు. వెనక ఎవరూ లేరు. అంతే మనోడి కామం బయటకు తన్నుకొచ్చింది. పక్కనే ఉన్న మహిళకు ముద్దులు పెట్టాడు. ఒకటీ, రెండు కూడా చాలా సమయం అలాగే మిస్ బిహేవ్ చేశాడు. ఈ వీడియోలో ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. వెనక ఎవరూ లేరు.. ముందున్న వాళ్లు తీసే అవకాశం లేదు కదా అని మీకు డౌట్ రావొచ్చు.. ఆ ప్రైవేట్ బస్సులో సీసీ కెమెరా ఉంది. తర్వాత ఈ వీడియో చూసిన కొందరు ప్రైవేట్ బస్సు సిబ్బంది.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పని చేసింది ఎవరో ఆకతాయి కదా.. అతను మహారాష్ట్ర  రాష్ట్రం గడ్చిరోలి జిల్లా బీజేపీ లీడర్ రవీంద్ర బవంతాడే. అప్పటి వరకు వాళ్లిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉన్నా.. వీడియో లీక్ అయిన తర్వాత మాత్రం.. ఆ మహిళ కంప్లయింట్ చేసింది. కదులుతున్న బస్సులోనే బలవంతం చేశాడని.. అత్యాచారం చేశాడని పోలీసులకు కంప్లయింట్ చేసింది. పెళ్లి చేసుకుంటానని.. ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది. మా ప్రభుత్వమే అధికారంలో ఉందని.. సహకరించకపోతే ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించాడని ఆ మహిళ కన్నీళ్లతో చెబుతోంది. గడ్చిరోలి బీజేపీ లీడర్ రాసలీలలు బయటపడటంతో.. మహారాష్ట్రలో నెటిజన్లు రెచ్చిపోయారు. పవర్ లో ఉంటే ఏమైనా చేస్తారా అంటూ నిలదీశారు. బస్సులో మహిళపై ఇతని చేష్ఠలతో బీజేపీ సర్కార్ కూడా ఇరకాటంలో పడింది. కాంగ్రెస్, శివసేన పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy