దుమ్ములేపుతున్న వన్ ప్లస్ 5

oneplusవన్ ప్లస్ 5 అమ్మకాల్లో దుమ్ములేపుతోంది. స్మార్ట్ ఫోన్ ల చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999 కాగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ ధర రూ.37,999. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. అమెరికా, కెనడా, హాంక్ కాంగ్ లలోని స్టోర్స్ లో ఔట్ ఆఫ్ స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ మోడల్స్ 48 గంటల్లోపే హాట్ కేకుల్లా అమ్ముడైనట్టు చెబుతున్నారు కంపెనీ ప్రతినిధులు.  ఈ నెల 27 నుంచి యూజర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా, లైన్లలో బారులు తీరి నిలబడాల్సిన పనిలేకుండా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని, అందుకు గాను పెద్ద ఎత్తున స్టాక్‌ను ఆయా దేశాలకు పంపుతున్నామని వన్ ప్లస్ ప్రతినిధులు తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy