దుమ్ము తుఫాన్ తో ఉత్తర ప్రదేశ్ లో 13 మంది మృతి

dustఉత్తర ప్రదేశ్ లో బుధవారం (జూన్-13) సంభవించిన దుమ్ము తుఫానులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుమ్ము తుఫాన్ ప్రభావంతో గొండా, ఫైజాబాద్, సీతాపూర్ జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ తుపాన్ ధాటికి 24 గంటల్లోనే 13 మంది చనిపోయారు. సీతాపూర్ జిల్లాలో ఆరుగురు, గొండాలో ముగ్గురు, కౌశాంబిలో ఇద్దరు చనిపోగా, ఫైజాబాద్, హర్డొయ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీని ప్రభావంతో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘోర విపత్తు పట్ల విచారం వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈ ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం. అలాగే చనిపోయినవారందరికి తక్షణమే ఎక్స్ గ్రేషియో అందచేయలన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy