దుమ్ము, ధూళి : దుబాయ్ ని వణికిస్తున్న భీకర గాలులు

dubai
దుబాయ్ లో వాతావరణ ఎమర్జెన్సీ ప్రకటించారు. భీకరమైన ప్రచండ గాలులకు ఏడారిలోని ఇసుక సిటీని ముంచెత్తింది. 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న గాలులతో దుబాయ్ వణికిపోతుంది. దుమ్ము, ధూళి, ఇసుకతో దుబాయ్ లోని షార్జా ఎయిర్ పోర్ట్ నిండిపోయింది. మూడు అడుగుల మేర షార్జా ఎయిర్ పోర్ట్ లో ఇసుక మేటలు వేసింది. అదే విధంగా అబుదాబి, మాక్టోమ్ అంతర్జాతీయ విమాశ్రాయాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో విమాన రాకపోకలను నిలిపివేశారు.

అదే విధంగా గల్ఫ్ లోని అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సాధారణం కంటే 4 నుంచి 6 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లో ఏర్పడిన దుమ్ము, ధూళి, ఇసుకతో కూడిన గాలులు భీకరంగా ఉండటంతో ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. వాహనాలను చెట్లు, షెడ్లు కింద పార్క్ చేయొద్దని సూచించారు. భవన నిర్మాణ కార్మికులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి అధికారులు కోరారు. వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పులతో మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy