‘దువ్వాడ జగన్నాథమ్’ టైటిల్ సాంగ్

djదువ్వాడ జగన్నాథమ్ సినిమా టైటిల్ సాంగ్  రిలీజ్ అయ్యింది. 4 నిమిషాల 20 సెకన్ల నిడివిగల ఈ పాటలో అల్లు అర్జున్‌ని చూపించీ, చూపించనట్టుగా చూపించారు మేకర్స్. జొన్నవిత్తుల రాసిన ఈ లిరిక్స్‌కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా విజయ్ ప్రకాశ్ ఈ పాట పాడారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే బన్నీ సరసన జంటగా నటిస్తోంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘దువ్వాడ జగన్నాథమ్’ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. బన్ని-డీఎస్పీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దువ్వాడ జగన్నాథమ్ ఆడియోపై అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. ఆ అంచనాలని అందుకునే విధంగానే ఆ సినిమా టైటిల్ ట్రాక్ కూడా రిలీజైంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy