దేవతల టాటూ వేసుకున్నాడని దాడి

tattoo12ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంటను బెంగళూరులో స్థానికులు చితకబాదారు. ఇండియాకు టూరిస్టులుగా వచ్చిన మాట్ కీత్ (21), అతని గర్ల్ ఫ్రెండ్ ఓ హోటల్లో కూర్చుని ఉన్నారు. ఆ టైంటో  అక్కడే ఉన్న కొందరు వ్యక్యులు.. అతని కాలిపై ఎల్లమ్మ దేవి బొమ్మ.. వీపుపై గణేష్ బొమ్మ టాటూ రూపంలో ఉండటాన్ని గమనించారు. కాలి పైన ఎల్లమ్మ దేవి బొమ్మ వేసుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ మండిపడ్డారు. హిందూమతన్ని అవమానించారని…వెంటనే టాటూ చెరిపేసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని చితకబాది… క్షమాపణలు చెప్పించిన తర్వాత వాళ్లను పోలీసులకు అప్పగించారు. కాలి పైన టాటూను తొలగించుకోవాలని పోలీసులు సూచించారు. ఇందుకు సంబంధించి మాట్ కీత్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. తాను భారతదేశాన్ని, హిందూమతాన్ని గౌరవిస్తానని అందులో తెలిపాడు.

51445252851_625x300

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy