దేవరగట్టులో సేమ్ సీన్

hqdefaultకర్నూలు జిల్లా హోళగుంద మండలంలోని దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. యేటా దసరా రోజు జరిగే స్వామివారి కల్యాణోత్సవానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉత్సవంలో భాగంగా 10 గ్రామాల ప్రజలు ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు జరిగే బన్ని ఉత్సవం… ఈ సారి కూడా రణరంగంగా మారింది.

బన్ని ఉత్సవంలో భాగంగా ఉత్సవ విగ్రహాలు దక్కించుకునేందుకు…. 10 గ్రామాల ప్రజలు రెండుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కర్రల సమరం కంటిన్యూ అయ్యింది. ఈ సమరంలో 60మందికి పైగా గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది.

దేవరగట్టు ఉత్సవాల్లో భాగంగా జరిగే ఈ కర్రల సమరంపై ఎన్నో ప్రచారాలు ఉన్నాయి. పూర్వం మునులు ఇక్కడి కొండలపై తపస్సు చేసుకునే వారని.. రాక్షసులు మునులకు ఆటంకాలు కలిగించడంతో కాపాడాలని శివపార్వతులను వేడుకోవడంతో… పార్వతీ దేవి రాక్షసులను చంపిందని పురాణం . అయితే రాక్షసులు చనిపోయే ముందు చివరి కోరికగా ఐదు చుక్కల రక్తం ఇవ్వాలని కోరడంతో పార్వతీదేవి రక్తం ఇచ్చిందని చెబుతుంటారు. ఈ ఆనవాయితీగానే కర్రల సమరం జరుపుతున్నామన్నది భక్తుల వెర్షన్.

బన్ని ఉత్సవంలో భాగంగా జరిగేది కర్రల సమరం కాదని.. కేవలం వినోద క్రీడే అంటున్నారు భక్తులు. ఉత్సవంలో పాల్గొనే వాళ్లు ఉద్దేశపూర్వకంగా ఎవరూ కొట్టుకోరని చెబుతున్నారు. బన్ని ఉత్సవాన్ని పోలీసులు నిషేధించినా… భక్తులు ఆనవాయితీ కొనసాగించారు. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాన్ని తాము కంటిన్యూ చేస్తున్నామంటున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy