దేవుడా : ముళ్ల‌పందిని మింగి.. ముప్పతిప్పలు

pithonనిన్న క‌ర్నాట‌క‌లో నీటికోసం త‌చ్చాడుతున్న పెద్ద పాముకు స్థానికులు బాటిల్‌తో నీళ్లుప‌ట్ట‌డం చూశాం. బ్రెజిల్ దేశంలో ఓ కొండ‌చిలువ క‌డుపుకాలి ఆక‌లి తీర్చుకునేందుకు త‌చ్చాడుతుండ‌గా దానికి ఓ ముళ్ల‌పంది క‌నిపించింది. అంతే ఆవుర‌మ‌ని మింగేసింది. ముళ్ల‌పందిని మింగిన ఆ కొండ‌చిలువ ప‌డ్డ ఇబ్బంది వ‌ర్ణ‌నాతీతం. ఎటూ క‌ద‌ల‌లేని ప‌రిస్థితి. పైగా ముళ్ల‌పంది ముళ్లులు చ‌ర్మంపై  చొచ్చుకుపోవ‌డంతో తెగ ఇబ్బంది ప‌డిపోయింది. ఇలా ఇబ్బంది ప‌డుతున్న పాము ఓ ఫోటో గ్రాఫ‌ర్ కంట ప‌డింది. వెంట‌నే దాన్ని షూట్ చేశాడు. త‌న‌తో పాటు ఉన్న కుక్క అయితే ఆ పామును చూసి తెగ మొరిగింది. కుక్క దాడి చేస్తుందేమో అన్న‌ట్లుగా త‌న‌ను తాను కాపాడుకునేందుకు ఆ కొండ‌చిలువ ముడుచుకుంది. ఆ క్ర‌మంలో చ‌ర్మంపై ఉన్న ముళ్లులు కుచ్చుకోవ‌డంతో మరింత ఇబ్బంది ప‌డింది.

మింగిన ముళ్ల‌పంది అరిగేందుకు క‌నీసం నాలుగు నుంచి ఆరు రోజులు ప‌డుతుంద‌ట‌. అంటే అంత‌వ‌ర‌కు ఈ కొండ‌చిలువ‌కు న‌ర‌కం త‌ప్ప‌ద‌న్న‌ట్లే. అదృష్టం లేకుంటే ప్రాణాలు కూడా పోయే అవ‌కాశ‌ముందంటున్నారు జంతుశాస్త్ర నిపుణులు. ఈ తంతునంతా రికార్డు చేసిన వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అయ్యింది. కొంద‌రు జంతుప్రేమికులు పాము ప‌డుతున్న ఇబ్బందిని చూసి జాలిప‌డ‌గా మ‌రికొంత మంది త‌మ‌దైన శైలిలో కామెంట్స్ రాశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy