దేవుడి ముందు పాట పాడతా.. నాకు అనుమతివ్వండి

kj-yesu-dasకేజే యేసుదాసు.. సంగీత ప్రపంచంలో ఆయనో లెజెండ్. అంత గొప్ప గాయకుడికీ కొన్ని ఆంక్షలు. అవే ఆయన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. ప్రఖ్యాత కేరళ పద్మనాభ స్వామి ఆలయం, గురువాయరుప్ప టెంపుల్ లలోకి ఆయనకు అనుమతి లేదు. ఎంతో కాలంగా ఆయన ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా మరోసారి ప్రయత్నించారు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా పాడేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ దేవాలయ  అధికారులకు లేఖ రాశారు.  క్రైస్తవ రోమన్‌-క్యాథలిక్‌ కుటుంబంలో జన్మించిన యేసుదాసు ప్రత్యేక దూత ద్వారా తన లేఖను అధికారులకు పంపారు. ఈ విషయంలో తుది నిర్ణయం ఆలయ కమిటీ తీసుకోనుంది. హిందూ మతంపై విశ్వాసం ఉన్నవారికి ఆలయంలో ప్రవేశముంటుందని ఆలయ కమిటీ చెప్తోంది. అనేక మంది దేవుళ్లపై పాటలు పాడి.. ఆధ్యాత్మిక పారవశ్యాన్ని కలిగించిన ఆ మహనీయుడికి దేవాలయాల్లోకి అనుమతి లభించకపోవడంపై సంగీత ప్రియులను తీవ్రంగా కలచివేస్తోంది. మరి ఆలయ కమిటీ ఏ నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాలి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy