దేవుడు మంచి అన్నయ్యను ఇచ్చాడు: ఎంపీ కవిత

kavitha-nzb-ktrనిజామాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరపాలని మంత్రి కేటీఆర్ ను కోరారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఆర్మూర్ జనహిత ప్రగతి సభలో మాట్లాడిన ఆమె.. “అన్నను సాదరంగా ఆహ్వానించిన తమ్ముళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అవి ఇవాళ్టికి కూడా రాజకీయంగా సుస్థిరంగా లేవు. తెలంగాణ ఏర్పడిన తర్వాత…. అస్థిరత ఏర్పడుతుందని అన్నారు. ఆ మాటలను తప్పవని రుజువు చేస్తూ… సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో నెంబర్ వన్ గా నిలుపుకున్నాం.

రాష్ట్రంలో పచ్చ పార్టీకి చుక్కుల చూపించామని తెలిపారు కవిత. కాంగ్రెస్ కుట్రలను చేధించామన్నారు. ఇప్పుడు బలమైన పార్టీ తమదేనన్నారు. పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీయనీ.. పెన్షన్లు అందిస్తున్నామని… కష్టం తెలిసిన మనిషి కాబట్టే సీఎం కేసీఆర్ ఇవన్నీ అందిస్తున్నామన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మైనార్టీల గురించి ఆలోచిస్తున్నామన్నారు. ఇంతకు ముందు జరిగిన వాటికంటే… ఎక్కువ మంది సభ్యత్వం తీసుకుంటున్నారన్నారు. ఆడబిడ్డలకు… అన్నలకు ప్రత్యేకంగా.. అనుబంధం ఉంటుంది. అమ్మ ఆత్మీయత, నాన్న బాధ్యత అన్నలో ఉంటుంది. దేవుడిని ఎలాంటి అన్నయ్య కావాలో కోరుకుంటారో అలాంటి అన్నే తనకు ఇచ్చారన్నారు.  

ఐదు మున్సిపాల్టీలకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలన్నారు. దయచేసి… కార్పొరేషన్ కు 100 కోట్లు.. ఐదు మున్సిపాల్టీలకు చెరో 50 కోట్లు… మొత్తం రూ.350 కోట్లు ఇవ్వాలని కోరారు. వ్యవసాయానికి మారుపేరు నిజామాబాద్…. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చెయ్యాలని కోరారు. మినీ టీ హబ్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. సీఎం కేసీఆర్.. ఏ జిల్లాకు ఇవ్వనన్ని నిధులు తమకు ఇచ్చారని.. అలాగే మంత్రి కేటీఆర్ కూడా ఇవ్వాలని కోరకుంటున్నామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy