దేవేందర్ గౌడ్ కంపెనీల పై ఐటీ దాడులు..

హైదరాబాద్: టీడీపీ సీనియర్ లీడర్ దేవేందర్ గౌడ్ కంపెనీల పై ఇవాళ(నవంబర్.15) ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్ లో ఆయనకున్న బిస్కెట్ కంపెనీలతో పాటు రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేశారు. మూడేళ్లుగా ఈ కంపెనీల్లో ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఆ కంపెనీల్లోకి ఫండ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు.. అన్న అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ దాడుల్లో మొత్తం 20 టీమ్స్ పాల్గొన్నాయి.

ఇప్పటికే ఉత్తరాంధ్ర లో ఉన్న దేవేందర్ గౌడ్ కంపెనీల్లో ఐటి అధికారులు తనిఖీలు చేశారు. దేవేందర్‌గౌడ్‌ కుమారుడు వీరేందర్‌గౌడ్‌ ఉప్పల్‌ నుంచి మహాకూటమి(టీడీపీ) అభ్యర్థిగా ఉన్నారు. ఈ క్రమంలో ఐటీ దాడులు జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఐటి దాడుల పై  వీరేందర్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. తమపై ఎలాంటి దాడులు జరిగినా భయపడేది లేదని ఆయన తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy