దేవేగౌడ దేశప్రధానిగా అద్భుత సేవలందించారు: బాబు

కేంద్ర ప్రభుత్వంపై పోరాటం మరింత ఉధృతం చేశారు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ఇప్పటికే కాంగ్రెస్ తో దోస్తీ చేసిన ఆయన.. ఇప్పుడు జేడీఎస్ ముఖ్యనేతలను కలిశారు. బెంగళూరు వెళ్లిన ఆయన దేవేగౌడ, కుమారస్వామితో సమావేశమయ్యారు.

నరేంద్ర మోడీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం దేశంలో అనేక సమస్యలు సృష్టించిందన్నారు మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ. రాజ్యాంగ సంస్థలను అస్థిరపరిచిందని ఆరోపించారు. ఇప్పుడు NDA ప్రభుత్వాన్ని దించేందుకు కాంగ్రెస్ సహా సెక్యులర్ పార్టీలన్ని జట్టుకట్టాలన్నారు. అందుకు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుంటున్నారని చెప్పారు.

దేశప్రధానిగా దేవేగౌడ అద్భుతమైన సేవలందించారని కొనియాడారు చంద్రబాబు. ఆయన మద్దతు కోరేందుకే బెంగళూరు వచ్చినట్టు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కుమారస్వామి కృషి చేస్తున్నారన్నారు. మోడీ పాలనలో ఆర్బీఐతో సహా.. వ్యవస్థలన్నీ నిర్వీర్యమై పోయాయని ఆరోపించారు చంద్రబాబు.

రేపు(శుక్రవారం) చెన్నై వెళ్లనున్న చంద్రబాబు.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ను కలుస్తారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy